ఆటోలో వాట్సన్

కావాలనుకుంటే ఏసీ కారు వస్తుంది.. అదీ చాలదనుకుంటే ఒక్క మాట అడిగితే చాలు అన్ని హంగులున్న ప్రత్యేకమైన వాహనాన్ని అతనికి ఇస్తారు. బోలెడంత మంది సెక్యూరిటీ తో ఎక్కడికి కావాలంటే అక్కడికి.. ఎలా కావాలంటే అలా తిప్పి తీసుకువస్తారు. కానీ, ఆటను అందరిలాంటోడు కాడు. అతనే షేన్ వాట్సన్. ఆస్ట్రేలియా క్రికెటర్. ఇలా అంటే గుర్తు పట్టేవారు మనలో చాలా తక్కువ. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్సమెన్ అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు.

మొన్న జరిగిన ఐపీఎల్ ఫైనల్ లో రక్తం ఓడుతున్నా బ్యాటింగ్ చేసి ప్రత్యర్థిని బెంబేలెత్తించిన వాట్సన్ ఇపుడు మన క్రికెట్ అభిమానులందరికీ ఇష్టుడైపోయాడు. ఆ మ్యాచులో చెన్నై ఓడిపోయినా.. వాట్సన్ పోరాట ప్రతిభ హైలైట్ గా నిలిచి పోయింది. ఇపుడు మరోసారి వాట్సన్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

ఐపీఎల్ పూర్తయిన తరువాత వాట్సన్ తన భార్య పిల్లల్తో కల్సి చెన్నై అంతా చుట్టేశాడు. సరదాగా ఊరంతా తిరిగి చూసి సరదా పడిపోయాడు. అయితే, అతను ఓ సాధారణ ప్రయాణికుడిలా ఆటోలో తిరగడం ఇపుడు అభిమానుల్ని మరోసారి అతనికి ఫిదా అయిపోయేలా చేసింది. ఇపుడు సోషల్ మీడియాలో వాట్సన్ ఆటోలో తిరుగుతున్న ఫోటో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Undefined index: cookies in /home/content/n3pewpnaspod02_data06/42/42274742/html/wp-content/plugins/live-composer-page-builder/modules/tp-comments-form/module.php on line 1638

andhrasamacharam