తాకరాని చోట తాకాడని తాట తీసింది!

అమ్మాయి కనబడితే చాలు.. ఆకతాయిలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. రద్దీగా వుండే ప్రాంతాల్లో అయితే ఇది మరీ దారుణంగా ఉంటుంది. మహిళలను మాటలతోనే కాదు తమ చేతులతోనూ హింసిస్తారు. సాధారణంగా చాలా మంది ఇటువంటి వారి పట్ల తమ జాగ్రత్తలో తాముండాలని భావిస్తారు. అయినా సరే.. పనికిమాలిన వేషాలతో పొద్దుపుచ్చే పోరంబోకులు తమ వికృత చేష్టలతో వికార ఆనందాన్ని పొందుతుంటారు. అయితే, ఇటువంటి సంఘటనలు జరిగినపుడు మహిళలు సాధారణంగా తలవొంచుకుని బాధపడుతూ తప్పించుకుని పోతారు. గొడవ పడితే పరువు పోతుందని.. అందరూ తమను తప్పుగా చూస్తారేమోననీ భావిస్తారు. కానీ, హరియానాలోని ఫతేబాద్ లో ఇలాంటి చెశాతాలకు దిగిన ఆకతాయిని ఈడ్చి ఈడ్చి కొట్టింది. ఆసుపత్రి క్యూలో నిలుచున్న తనపట్ల అసభ్యంగా ప్రవర్తించి తాకరాని చోట చేయి తాకించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ మహిళ ఆ వ్యక్తిని పట్టుకుని చితకబాదింది. చుట్టుపక్కల ఉన్నవారు వారిస్తున్నా వినకుండా నేలమీద పాడేసి కుమ్మేసింది. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Undefined index: cookies in /home/content/n3pewpnaspod02_data06/42/42274742/html/wp-content/plugins/live-composer-page-builder/modules/tp-comments-form/module.php on line 1638

andhrasamacharam