దొంగల నాయకుడు నానీ?

నేచురల్ స్టార్ నానీ.. కొత్త సినిమా గ్యాంగ్ లీడర్. విక్రమ్ కుమార్ దర్శకత్వం లో శరవేగంగా ముస్తాబవుతోంది. నానీ సరసన 5 గురు హీరోయిన్లు సినిమాలో నటిస్తున్నారు. ఈ విషయం సంచలనం గా మారింది. ఈ లోపు గ్యాంగ్ లీడర్ పేరుపై కూడా కొంత గందర గోళం నడిచింది. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ముందుకువచ్చే నానీ ఈ సినిమాలోనూ సరికొత్త తరహాలో వస్తున్నదని వినిపిస్తోంది. విక్రమ్ కుమార్ చెప్పిన కథలోని మంచి పాయింట్ను నమ్మి ఈ సినిమా ఒప్పుకున్నాడట నానీ అని చెబుతున్నారు. తాజాగా నానీ ఈ సినిమాలో దొంగలకు నాయకుడుగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అయితే, ఆ దొంగలు 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారంట. ఆ హీరోయిన్లకు బాస్ గా అంటే నాయకుడుగా నానీ కనిపించబోతున్నాడన్నది భోగట్టా. హీరోయిన్లేమిటి దొంగలేమిటి? నానీ వాళ్లకు నాయకుడుఏమిటి? అసలు గ్యాంగ్ లీడర్ అంటే హీరోయిన్ల గ్యాంగ్ లీడర్ అంటారేంటి అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే కొంత కాలం ఆగాల్సిందే. ఈ లోపు ఇలా వచ్చే లీకులను చూస్తూ ఎంజాయ్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Undefined index: cookies in /home/content/n3pewpnaspod02_data06/42/42274742/html/wp-content/plugins/live-composer-page-builder/modules/tp-comments-form/module.php on line 1638

andhrasamacharam