ప్రభాస్ సినిమాకి భారీ సెట్

చేస్తే భారీ సినిమాలే చేయాలి అని ఫిక్స్ అయిపోయాడు ప్రభాస్. బాహుబలి సినిమా తో ప్రభాస్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి చేరిపోయింది. దీంతో చేస్తే భారీ సినిమాలే చేయాలి.. దానిలో క్వాలిటీ విషయం లో ఎక్కడా రాజీ పడకూడదు ఈ రెండు అంశాలకే ప్రాధాన్యం ఇస్తున్నాడు ఈ యంగ్ రెబల్ స్టార్. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమాలో చేస్తున్నాడు ప్రభాస్. ఇది ఈ ఆగస్టు పదిహేనుకు విడుదల కానుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక తరువాతి సినిమా పిక్స్ అయిపొయింది. ఇది 1970ల నాటి కథగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కథకు అనుగుణంగా యూరప్ లోని పలు లొకేషన్స్ లో షూటింగ్ చేయాల్సి ఉంటుందట. అయితే అన్ని లొకేషన్లలో షూటింగ్ చేయడం కష్టతరమైన విషయం కాబట్టి ఇక్కడే భారీ సెట్లు వేసి షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ సెట్ లకు ప్రత్యేకంగా 30 కోట్ల బడ్జెట్ అవుతుందని సినీ వర్గాలంటున్నాయి. ఇందులో కీలక సన్నివేశాలు చిత్రీకరించేలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకి జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. సాహో మూవీ దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం కూడా రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల బడ్జెట్ అంచనాలతో ప్రభాస్ రేంజికి తగిన విధంగా ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా క్వాలిటీ చిత్రం అదించడానికే ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. Also యూవి క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే 3 షెడ్యూల్స్ పూర్తయ్యాయి. పూజా హెగ్డే హీరోయిన్. ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Undefined index: cookies in /home/content/n3pewpnaspod02_data06/42/42274742/html/wp-content/plugins/live-composer-page-builder/modules/tp-comments-form/module.php on line 1638

andhrasamacharam