హోదాకి అడ్డం మోదీ 

0
22
 

 ప్రధానిగా నరేంద్ర మోదీ ఉన్నతకాలం ప్రత్యేక హోదా రాదని అన్నారు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. అలాగని నిరాశ చెందకుండా హోదా కోసం పోరాటం చేయాలని సూచించారు. మంత్రుల మీద సీబీఐ దాడులు జరుపుకోవాలనుకుంటే జరుపుకోవచ్చని  సవాల్ ‌చేశారు. మోదీది కక్ష్య సాదింపు చర్య అని.. ఆయన వల్ల రాష్ట్రానికి న్యాయం జరగదని జేసీ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు 29 సార్లు దిల్లీ వెళ్లినా మోదీ పట్టించుకోలేదని మండిపడ్డారు.వైకాపా ఎంపీలు దొంగ రాజీనామాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని జేసీ దివాకర్‌రెడ్డి దుయ్యబట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here