జయరాం హత్య కేసులో వీడిన మిస్టరీ

హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో మిస్టరీ వీడింది. రాకేష్‌రెడ్డిని హంతకుడిగా పోలీసులు నిర్ధారించారు. కిరాయి హంతకులతో జయరాంను హత్య చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో ఐదుగురిని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జయరాంను హైదరాబాద్‌లోనే చంపేసి మృతదేహాన్ని కంచికచర్ల వద్ద పడేసినట్లు తేల్చారు. రాకేష్‌రెడ్డి వద్ద తీసుకున్న రూ.4.5కోట్ల అప్పే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి, రెండు రోజులుగా దర్యాప్తు చేపట్టారు. సెల్‌సిగ్నల్స్ ఆధారంగా కేసు మిస్టరీని చేధించారు. జయరాంను హైదరాబాద్‌లోనే హత్య చేసి, ఆపై మృతదేహాన్ని కృష్ణాజిల్లా కంచికచర్లకు తీసుకువచ్చారు. జయరాం తలకు బలమైన గాయమైనట్లు చిత్రీకరించేందుకు బీర్‌ బాటిల్‌తో తలపగులగొట్టి, కారులోని వెనుక సీట్లో మృతదేహాన్ని ఉంచి కారును పక్కకు నెట్టేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సాయంత్రం పోలీసులు మీడియాకు వెల్లడించనున్నారు.
 
మరోవైపు ఈరోజు హైదరాబాద్‌లో జయరాం అంత్యక్రియలు జరుగనున్నాయి. అమెరికా నుంచి జయరాం కుటుంబసభ్యులు నగరానికి చేరుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Undefined index: cookies in /home/content/n3pewpnaspod02_data06/42/42274742/html/wp-content/plugins/live-composer-page-builder/modules/tp-comments-form/module.php on line 1638

andhrasamacharam