1-6-2018 శుక్రవారం

1-6-2018 శుక్రవారం

శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం గ్రీష్మ రుతువు; అధిక జ్యేష్ఠ మాసం; బహుళ పక్షం తదియ: రా.11-31 తదుపరి చవితి పూర్వాషాఢ నక్షత్రం: పూర్తి అమృత ఘడియలు: రా. 1-45 నుంచి 3-31 వరకు వర్జ్యం: మ. 3-09 నుంచి 4-55 వరకు దుర్ముహూర్తం: ఉ. 8-05 నుంచి 8-56 వరకు తిరిగి మ. 12-24 నుంచి 1-16 వరకు రాహుకాలం: ఉ. 10-30 నుంచి 12-00 వరకు సూర్యోదయం: ఉ.5-29; సూర్యాస్తమయం: సా.6-27

ఆధ్యాత్మిక సౌరభం

జీవితం అంటే- పోరాటం, నిత్య సంఘర్షణ, ఒకటి నుంచి మరొకటిగా సమస్యలతో ప్రయాణం చేయడం! ప్రతి వ్యక్తినీ ఎన్నో కడగండ్లు చుట్టుముడుతుంటాయి. పదేపదే అదేపనిగా అవి వేధిస్తుంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొని, స్థిరచిత్తంతో ముందడుగు వేయడమే అతడి కర్తవ్యం. పులిస్వారీ వంటిది జీవితం. ఆ జీవన శార్దూలాన్ని ఒడుపుగా నియంత్రించాల్సింది మనిషే!
సజ్జన సాంగత్యం, ధార్మిక అంశాల సత్సంగం, ఉత్తమ గ్రంథపఠనం, సంయమనం వంటివి వ్యక్తిని ఉద్ధరిస్తాయి. అతడు ఆత్మదర్శనం చేసుకోవాలి. అంతర్వీక్షణతో మనోమందిరంలోని పరమాత్మను దర్శించాలి. అందుకే ఈ దేహాన్ని విజ్ఞులు ‘నారాయణుడి నెలవు’గా అభివర్ణించారు. అంతర్యామిది అంతటా ఆవరించి ఉన్న అమేయ అద్భుత శక్తి. అది భగవత్‌ తత్వం. కాళ్లు లేకున్నా, వాయువేగంతో సంచరిస్తుంది. చేతులు లేకపోయినా, ఆపద పాలైన భక్తుణ్ని ఒడిసి పట్టుకుంటుంది. కళ్లు లేనప్పటికీ, ఆ శక్తి తీక్షణ వీక్షణాలతో భక్తలోకాన్ని దర్శిస్తుంది. చెవులు లేకున్నా, వారి ఆర్తిని శ్రద్ధగా ఆలకిస్తుందన్నది- ఉపనిషత్తుల సందేశం.
భగవంతుడు సర్వకాల సర్వావస్థల్లో ఉన్నాడు’ అనే జ్ఞానదృష్టి మనిషికి కావాలి. అప్పుడే అతడికి విలువలతో కూడిన జీవనం, ఆధ్యాత్మిక జీవన సరళి సుసాధ్యమవుతాయి. జీవన నౌక అల్లకల్లోలాల్ని దాటి మోక్షతీరం చేరాలంటే, నైతిక సూత్రాలే దిక్సూచి! జీవిత రథం సవ్యంగా సాగాలంటే, సుగుణాలనే గుర్రాలు దృఢంగా ఉండాలి. సమత, మమత అనే రెండు చక్రాల సమన్వయంతోనే బతుకుబండి సాఫీగా ముందుకు వెళుతుంది.
డా.ధనుంజయ
ఛైర్మన్.
7702417779.
*శ్రీ గోదా తాయారు రంగనాథ స్వామి దేవాలయము*& *శ్రీ రామానుజ సేవ ట్రస్ట్*.శ్రీరంగ గిరి.క్రిష్ణానగర్.
హెచ్.బి.కాలనీ.మౌలాలీ.  

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here