ఎస్సి ఎస్టీ నిధులు మళ్లిస్తే ఊరుకోము :అర్పిఐ రాష్ట్ర కమిటీఎన్నికలలో అధికార పార్టీ ఎన్నికల తాయిలాల కోసం ఎస్సి ఎస్టీ నిధులను మళ్లించి వారికి త్రివ ద్రోహం చేస్తున్నారని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు.

ప్రజలను మభ్యపెట్టే విధంగా అధికార పార్టీ నిధులను మళ్లించడం తగదన్నారు.
ఎస్డీ ఎస్టీ నిధులు కేటాయించి వారి సంక్షేమము కోసం కాకుండా వేరు వేరు కార్యక్రమాలకు కేటాయించడం వారి ఎంత వరకు సబబు అన్నారు.
ప్రభుత్వం ఆచరణలో ఎంత మంది అర్హులకు ఎస్సి ఎస్టీ లకు రుణాలు మంజూరు చేస్తోందని,ఎంతో మంది అర్హులు లోన్లు కోసం ఎదురు చూస్తున్నా వారికి అందనన్ని నిబంధనలు పెట్టి లోన్లు ఇవ్వడం లేదన్నారు.

అర్పిఐ పార్టీ రాష్ట్ర సమావేశం విజయవాడలో మిడిసిటీ హోటల్లో సోమవారం జరిగింది.

రాష్ట్ర సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి అధ్యక్షత వహించారు.

సమావేశంలో కన్వీనర్ పేరం శివనాగేశ్వర్ రావు,గుంటూరు అధ్యక్షుడు మేకా వెంకటేశ్వర రావు,రాష్ట్ర సహాయ అధ్యక్షుడు డాక్టర్ సి.ప్రసాద్ రావు,మహిళ నాయకురాలు రత్న,సీనియర్ నాయకులు ధార ఆంజనేయులు ,ధూపం సత్యం, తిరువూరు నియోజక వర్గ అభ్యర్థి రాణి, ప్రసాద్ బాబు, తదితరులు వేదిక మీద ఆశీనులయారు
సమావేశంలో గ్రామ స్థాయి నుంచి సభ్యత్వం,కమిటీలు.పార్టీ నిధి.ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, జిల్లా స్థాయిలో పార్టీ సమావేశాలు, మార్చి 3 వ తేదీన అర్పిఐ పార్టీ జాతీయ అద్యక్షులు,సెంట్రల్ మినిస్టర్ శ్రీ రాందాస్ అత్వాలే గారు విజయవాడ పర్యటన గురించి సమావేశంలో చర్చించారు.
సమావేశంలో పార్టీ ఆంద్రప్రదేశ్ విస్తరణకు,ఎన్నికలో పార్టీ అనుసరించాల్సిన విధానాలను పార్టీ రాష్ట్ర కమిటీ చేర్చింది.
జిల్లా స్థాయిలో పార్టీ ఆధ్యక్షులు ప్రధాన పార్టీ ల బలాబలాల గురించి సమీక్షించారు.
సమావేశానికి 13 జిల్లాల అధ్యక్షులు ,రాష్ట్ర కమిటీ సభ్యులు,హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

andhrasamacharam