జాతీయ బాడీ లిఫ్టింగ్ పోటీలకు న్యాయ నిర్ణేతగా కిలాని గణేష్

10వ జాతీయ బాడీ లిఫ్టింగ్ పోటీలకు వాయుపుత్ర హెల్త్ క్లబ్ కిలాని గణేష్ న్యాయ నిర్ణేతగా ఎంపిక అయ్యారు. ఈ నెల 23,24 తేదీల్లో హర్యానా రాష్ట్రం పానిపట్ లో జరుగనున్న ఈ పోటీల్లో దేశం లోని అన్ని రాష్ట్రాల నుంచి 9 మంది జాతీయ రిఫరీలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గణేష్ ఒక్కరే సెలెక్ట్ కావడం విశేషం. గణేష్ ప్రస్తుతం వాయుపుత్ర హెల్త్ క్లబ్ ఛీఫ్ కోచ్ గా ఇండియన్ బాడీలిఫ్టింగ్ సంఘం ఉపాధ్యక్షునిగా, ఆంధ్ర బాడీ లిఫ్టింగ్ సంఘం ప్రధాన కార్యదర్శిగా తమ సేవలు అందిస్తున్నారు. గణేష్ ఎంపిక పట్ల ఆంధ్ర బాడీ బిల్డింగ్ సంఘం, విశాఖ బాడీ లిఫ్టింగ్ ప్రతినిధులు, సభ్యులు నగరం లోని పలు జిమ్ నిర్వాహకులు కోచ్ లు, క్రీడాకారులు తమ అభినందనలు తెలిపారు;.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Undefined index: cookies in /home/content/n3pewpnaspod02_data06/42/42274742/html/wp-content/plugins/live-composer-page-builder/modules/tp-comments-form/module.php on line 1638

andhrasamacharam