వారి ద్దరూ భయంకరమెయిన వ్యక్తులు : సీఎం చంద్రబాబు

ప్రధాని మోడీ రాజధర్మాన్ని వదిలి ఆంధ్రప్రదేశ్ పై కక్ష పెంచుకున్నారు. తెలుగు వారెప్పుడూ ఆత్మగౌరవంతో బ్రతుకుతారు. అది దెబ్బ తినే పరిస్థితి వస్తే తిరగబడతారు. ఇది చారిత్రాత్మక సత్యం. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. చలిలో వేలాది మైళ్ళు ప్రయ్నమ్ చేసి వచ్చి న్యాయం కోసం అడుగుతుంటే అవమానిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన ధర్మ దీక్ష ముగింపు సందర్బంగా రాత్రి ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాలపై గతంలో ఎన్టీఆర్‌, నేను ఇదే ఏపీ భవన్‌ వేదికగా ఉద్యమాలు మొదలుపెట్టాం. ఎన్టీఆర్‌ ఇక్కడే నేషనల్‌ ఫ్రంట్‌కు శ్రీకారం చుట్టారు. యునైటెడ్‌ ఫ్రంట్‌ కూడా ఇక్కడే ప్రాణం పోసుకొంది. ధర్మ సంస్థాపనలో ఏపీ భవన్‌ కీలక వేదికగా నిలుస్తూ వస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు, ఏపీ విభజన హామీలన్నీ నెరవేరుస్తామని ప్రధాని చెప్పడం వల్లే మేం ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్నాం. అన్నింటినీ అమలు చేస్తామని ప్రధానమంత్రి అభ్యర్థి హోదాలో మోదీ చెప్పారు. అమరావతి శంకుస్థాపన సమయంలో నీళ్లు, మట్టి ఇచ్చి అన్నింటినీ అమలు చేస్తామని వాగ్దానం చేశారు. అలాంటి వ్యక్తి నిన్న గుంటూరుకు వచ్చి విభజన చట్టం గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించకుండా నాపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇది అయిదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ సమస్య. దాన్ని దెబ్బకొడితే సహించం అన్నారు.
పరిపాలించే వ్యక్తులు ప్రజల మనోభావాలను గుర్తుపెట్టుకోవాలి. అలా కాకపోతే దేశ సమగ్రతకు భంగం కలుగుతుంది. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం చేస్తామంటే మీ ఆటలు సాగవని చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పరిపాలించే వ్యక్తులు బాధ్యతగా ఉండాలి. అధికారం నెత్తికి ఎక్కినప్పుడు దాన్ని దించే అధికారం ప్రజలకు ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో ఆస్తులు పోగొట్టుకుంటే మళ్లీ సంపాదించుకుంటాం కానీ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకొని బతకకూడదని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్‌. మోదీ అహంభావంతో ముందుకెళ్తున్నారు. అడిగినవారిపై దాడులుచేసే పరిస్థితి వచ్చింది. ఇంకా ఎక్కువ మాట్లాడితే మనమీద నిందలు వేస్తున్నారు. తప్పులు చేసిన వ్యక్తులే నిందలు వేస్తుంటే గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

andhrasamacharam