తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి ఆలయ తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. రథసప్తమి సందర్భంగా తిరుమల శ్రీవారు ఒకేరోజు ఏడు వాహనాలు అధిరోహించి భక్తులను కనువిందు చేయనున్నారు.అలాగే ఉదయం 9 గంటల నుంచి 10గంటల వరకు చిన్నశేషవాహనం, ఉదయం 11 గంటల నుంచి 12గంటల వరకు గరుడవాహనం, మధ్యాహ్నం 1గంటల నుంచి 2గంటల వరకు హనుమంతవాహనం, మధ్యాహ్నం 2గంటల నుంచి 3గంటల వరకు వరాహా పుష్కరిణిలో చక్రతాళ్వార్ కు చక్రస్నానం, సాయంత్రం 4 గంటల నుంచి 5గంటల వరకు కల్పవృక్షవాహనం, సాయంత్రం 6 గంటల నుంచి 7గంటల వరకు సర్వభూపాలవాహనం, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభవాహన సేవలు జరగనున్నాయి.

రథసప్తమిని పురస్కరించుకుని తిరుమల ఆలయం ఇలవైకుంఠాని తలపిస్తోంది. వివిధ రకాల పుష్పాలు, పండ్లతో శ్రీవారి ఆలయాన్ని అధికారులు శోభాయమానంగా తీర్చిదిద్దారు. వాహనసేవలను తిలకించేందుకు భారీగా భక్త జనం తిరుమలకు తరలిరానున్నారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Undefined index: cookies in /home/content/n3pewpnaspod02_data06/42/42274742/html/wp-content/plugins/live-composer-page-builder/modules/tp-comments-form/module.php on line 1638

andhrasamacharam