ఛానళ్ల ఎంపికకు గడువు పొడిగించిన ట్రాయ్‌

Widescreen high definition TV screen with video gallery.

దిల్లీ: కొత్త టారిఫ్‌ విధానం కింద ఛానళ్ల జాబితాను ఎంచుకునేందుకు ఇచ్చిన గడువును టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) మరోసారి పొడిగించింది. మార్చి 31, 2019 లోపు వినియోగదారులు తమకు కావాల్సిన ఛానళ్లను ఎంచుకోవచ్చని తెలిపింది. గతంలో ఆ గడువు జనవరి 31 వరకు ఉంది. దాన్ని ఇప్పుడు మరోసారి పొడిగించారు. ట్రాయ్‌ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 100 మిలియన్ల కేబుల్‌ సర్వీసులు, 67మిలియన్ల డీటీహెచ్‌ సర్వీసులు ఉన్నాయి.

ఛానళ్లను ఎంచుకోవడంలో కొందరు వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక కేబుల్‌ ఆపరేటర్లు ఛానళ్ల ఎంపిక విషయంలో వినియోగదారులకు అవగాహన కల్పించకపోవడంతో ఇటువంటి ఇబ్బంది తలెత్తుతుందని ట్రాయ్‌ వెల్లడించింది. ఛానళ్లు ఎంపిక చేసుకునేందుకు పాత ప్లాన్‌ కొనసాగుతోందని ట్రాయ్‌ తెలిపింది. బెస్ట్‌ ఫిట్‌ ప్లాన్‌ కింద వినియోగదారులు తమకు కావాల్సిన ఛానళ్లను ఎంపిక చేసుకోవడంలో ఎక్కువ మంది విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపికకు గడువును పొడిగించినట్లు ట్రాయ్‌ తెలిపింది. మార్చి 31లోపు ఎప్పుడైన వినియోగదారులు బెస్ట్‌ ఫిట్‌ ప్లాన్‌ కిందకు మారవచ్చు. బ్రాడ్‌క్యాస్ట్‌, కేబుల్‌ సేవల విభాగంలో ట్రాయ్‌ నూతన విధానం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానంలో వినియోగదారులు తమకు కావాల్సిన ఛానళ్లను మాత్రమే సబ్‌స్క్రైబ్‌ చేసుకుని చూడాల్సి ఉంటుంది. పన్నులతో కలిపి రూ.130కే 100 ఛానళ్లను వినియోగదారులు పొందవచ్చు. ఏయే ఛానళ్లను చూడాలనుకుంటున్నారో తమ సర్వీసు ప్రొవైడర్‌కు చెప్పాల్సి ఉంటుంది. ఆపైన కావాల్సిన ప్రతి ఛానల్‌కు నిర్ణయించిన ధరను చెల్లించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Undefined index: cookies in /home/content/n3pewpnaspod02_data06/42/42274742/html/wp-content/plugins/live-composer-page-builder/modules/tp-comments-form/module.php on line 1638

andhrasamacharam