గుంటూరు జిల్లా అభ్యర్థులను ప్రకటించిన అర్పిఐ రాష్ట్ర కమిటీ

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర కమిటీ నిర్ణయాలను రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు.

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) జాతీయ అద్యక్షుడు, సెంట్రల్ మినిస్టర్ శ్రీ రాందాస్ అత్వాలే గారి పర్యటన మార్చి మొదటి వారంలో ఉంది. దానిని విజయవంతం చేయాలి

ఫిబ్రవరి నెల చివరకు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే నిర్ణయాలు.

# గ్రామ స్థాయిలో సభ్యత్వం, పూర్తి చేయాలి.

# గ్రామ స్థాయి నుంచి,రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు విస్తరింప చేయాలి.

# నియోజకవర్గాలలో ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ఎంపిక చేసి రాష్ట్ర సెంటరుకు అందచేయాలి.

# 13 జిల్లాల్లోఎన్నికల సభలు,సమావేశాలకు రాష్ట్ర నాయకులు హాజరయ్యా క్రమంలో ఒక ప్రణాళిక తయారు చేయాలి.

అర్పిఐ సీనియర్ నాయకులు,ధూపం సత్యం ను ఉత్తరాంధ్ర జిల్లాల ఇంఛార్జిగా నియమించారు.

క్యాపిటల్ సిటీ రీజియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏకుల నాగరాజు, ను నియమించారు.

రాష్ట్ర యూనివర్సిటీ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు గా ఆంధ్ర యూనివర్సిటీ స్కాలర్ డాక్టర్ ఆనంద్ కుమార్ ను నియమించారు.

# తిరువూరు నియోజవర్గ అర్పిఐ పార్టీ ఇంచార్జి గా అనంత రాణి,ని నియమించారు

తాడికొండ ఇంచార్జి గా మెండం కోటేశ్వరరావు ను నియమించారు.

పత్తిపాడు నియోజక వర్గానికి దార ఆంజనేయులు ను నియమించారు

వేమూరు నియోజకవర్గ ఇంఛార్జిగా రోశయ్యను నియమించారు

పెదకూరపాడు నియోజకవర్గానికి ఇంఛార్జిగా బూసి ప్రసాద్ బాబును నియమించారు

గుంటూరు 1 నియోజక వర్గానికి వి వెంకటేశ్వర రావు ను నియమించారు

గుంటూరు 2 నియోజక వర్గానికి ఇంఛార్జిగా బి.ఐజయ్య ను నియమించారు

వినుకొండ నియోజక వర్గానికి చంద్ర నాయక్ ను నియమించారు.

నరసరావుపేట నియోజకవర్గ వర్గానికి ఇంఛార్జిగా వి.శ్రీనివాస్ ను నియమించారు.

పొన్నూరు నియోజక వర్గానికి ఇంఛార్జిగా షీరాజ్ ను నియమించారు.

రేపల్లె నియోజక వర్గానికి అర్పిఐ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మేకా వెంకటేశ్వర రావు ను ఇంఛార్జిగా ఉంటూ, ఎన్నికల్లో అర్పిఐ పార్టీ అభ్యర్థులు గా పోటీ చేయాలని నిర్ణయించారు.

పార్టీ విధి విధానాలు,ఎన్నికల పోటీ పై ఒక్క రోజు రాజకీయ శిక్షణా తరగతిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

పార్టీ ఎన్నికల ప్రచారానికి వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

పార్టీ అనుబంధ కమిటీలు అన్ని కూడా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Undefined index: cookies in /home/content/n3pewpnaspod02_data06/42/42274742/html/wp-content/plugins/live-composer-page-builder/modules/tp-comments-form/module.php on line 1638

andhrasamacharam