నేడు మళ్లీ ఢిల్లీకి బాబు

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ దీక్షలో పాల్గొనేందుకు ఆదివారం రాత్రి అక్కడకు వెళ్లిన ఆయన.. మంగళవారం రాత్రే ఇక్కడకు తిరిగివచ్చారు. అయితే ఢిల్లీ రాష్ట్ర సమస్యలపై ఆ రాష్ట్ర సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం అక్కడ నిరసన దీక్ష చేపడుతున్నారు. దానికి సంఘీభావం తెలిపేందుకు బుధవారం మధ్యాహ్నం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు.

దీనికోసం బుధవారం సాయంత్రం జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని చంద్రబాబు ఉదయానికే మార్చారు. కాగా.. విజయనగరంలో ముఖ్యమంత్రి పర్యటన గురువారానికి వాయిదాపడింది. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం బుధవారం మధ్యాహ్నం భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేయాల్సి ఉంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లాల్సి రావడంతో గురువారానికి దీనిని మార్చారు. కాగా, యూపీ సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ను అడ్డుకున్న వ్యవహారంపై చంద్రబాబు స్పందించారు. ఆయన పట్ల పోలీసు అధికారుల తీరును ఖండించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Undefined index: cookies in /home/content/n3pewpnaspod02_data06/42/42274742/html/wp-content/plugins/live-composer-page-builder/modules/tp-comments-form/module.php on line 1638

andhrasamacharam