రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) పై బురద చల్లడం మానుకోండి

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) పార్టీని డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ స్థాపించారని,నేడు ఎస్సి ఎస్టీలు, బిసి.మైనార్టీ లే కాకుండా ఓసి.లు కూడా అంబెడ్కర్ ఆశయాలు నచ్చి పార్టీలో పని చేయడానికి ముందుకు వస్తున్నారని అర్పిఐ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి బుదవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

ఎస్సి.ఎస్టీ. బిసి .మైనార్టీలు అదే బాటలో నేడు ఓసి కూడా అంబెడ్కర్ ఆశయాలు నచ్చి ఆకర్షితులై పార్టీలోకి వచ్చి పని చేస్తుంటే కొంత మంది గ్రూపు కట్టి పార్టీని,పార్టీ నాయకత్వాన్ని విమర్శించి బురద చల్లు తున్నారు

నేడు పార్టీని ,పార్టీ నాయకత్వాన్ని విమర్శించే వారు ఇదే పార్టీ లో నాయకత్వ స్థానంలో ఉండి పార్టీ ఔన్యత్యాన్ని చాటారని వారే నేడు పార్టీని విమర్శించడాన్ని ప్రజలు గమనించాలన్నారు.

నేడు పార్టీని, పార్టీ నాయకత్వాన్ని విమర్శించే వారు పార్టీ కోసం,పార్టీ అభివృద్ధి కోసం ఎంత చేశారు, అన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి కోరారు.

అర్పిఐ పార్టీ జాతీయ అధ్యక్షుడు సెంట్రల్ మినిస్టర్ శ్రీ రాందాస్ అత్వాలే గారు దేశం లో ఎస్సి ఎస్టీ బిసి మైనార్టీ లకు అన్యాయం జరిగితే చట్ట సభల్లో వెలుగెత్తి చాటుతున్నారని ఆయన గుర్తు చేశారు.

జాతీయ అధ్యక్షుడు అల్ ఇండియా స్థాయిలో తాను చేసిన కృషి ఫలితంగానే నేడు రిపబ్లికన్ పార్టీ భారత దేశ రాజకీయాల్లో ప్రత్యన్యాయ పార్టీగా విస్తరిస్తోందన్నారు.

ఆంద్రప్రదేశ్ లో కొందరు రాష్ట్ర నాయకత్వ స్థానంలో ఉంటూ పార్టీని ప్రజల్లోకి తీసుకపోకుండా ఎదుగు బోదుగు లేకుండా చేశారని అలాంటి వారు వెళ్తూ వెళ్తూ ఆరోపనులు చేస్తున్నారు

పార్టీ అభివృద్ధి ని , పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకపోవడంలో విఫలమై, నేడు ఆదరించిన పార్టీకి వెన్నుపోటు పొడిచి వేరు కుంపటి పెట్టుకున్న నాయకుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి హెచ్చరించారు

గ్రూపులు కట్టి పార్టీ ని విచిన్నం చేసిన వారు పార్టీ పేరుతో , ప్రజా సేవ పేరుతో వస్తున్నారని ప్రజలు గమనించాలి.

ఆంద్రప్రదేశ్ లో రిపబ్లికన్ పార్టీ అన్ని అసెంబ్లీ, లోక సభ స్థానాలకు పోటీ చేస్తోందన్నారు

ఎక్కువ సీట్లు బిసి లకు, మహిళలకు కేటాఇస్తామన్నారు..

రిపబ్లికన్ పార్టీ ఆంద్రప్రదేశ్ లో విస్తరణకు కృషి చెస్తోందని,పార్టీని అన్ని వర్గాల వారు ఆదరిస్తున్నారని అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

andhrasamacharam