వెంకటేశుడి ఆలయ నిర్మాణానికి భూకర్షణ పనులు ప్రారంభం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాజధాని నగరంలో వెంకటేశుడి ఆలయ నిర్మాణానికి సంబంధించి భూకర్షణ పనులు గురువారం ప్రారంభం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కామెంట్స్..

‘మనల్ని ఆశీర్వదించడానికి శ్రీవారు అమరావతికి వచ్చారు

ఆయన మా కులదైవం

ఆయన పాదాల దగ్గర పుట్టాను. ఆయన నాకు పునర్జన్మ ఇచ్చారు

2003లో అలిపిరిలో జరిగిన అతిపెద్ద ప్రమాదంలో బతికి బయటపడతానని ఎవరూ ఊహించి ఉండరు

అలాంటి ప్రమాదం నుంచి నన్ను రక్షించారు

వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టారు

ఆగమశాస్త్రానుసారం భూకర్షణ జరిపి పనులు ప్రారంభించాం

25 ఎకరాల్లో దేవాలయాన్ని నిర్మిస్తున్నాం

వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలనే తలంపుతో ఉచితంగా టీటీడీకి భూమి ఇస్తున్నాం

నేను కానీ,
పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కానీ.. వెంకటేశ్వరుని సేవలో సాంప్రదాయబద్ధంగా, నియమనిబద్ధలతో ఉన్నాం

అమరావతిలో వెంకటేశ్వరస్వామి దేవాలయం కట్టడం దానికి ప్రత్యక్షసాక్షులు కావడం మనందరి అదృష్టం

ప్రపంచమంతా హిందువులు భక్తిభావంతో కొలిచేదైవం మన రాష్ట్రంలో ఉండటం మనందరి పూర్వజన్మ సుకృతం

అమరావతికి వెంకటేశుడి ఆశీస్సులు కావాలి

కృష్ణానదికి ఈ పక్కన వెంకన్న

ఆ పక్కన దుర్గమ్మ ఉన్నారు. దీని రక్షణగా ఉన్నారు

వీరిద్దరి ఆశీస్సులతో అభివృద్ధిలో దూసుకుపోతాం

పవిత్ర దివ్యక్షేత్రంగా శాశ్వతంగా ఈ ఆలయం నిలిచిపోవాలని టీటీడీని కోరాను

అంటూ ఉద్వేగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Undefined index: cookies in /home/content/n3pewpnaspod02_data06/42/42274742/html/wp-content/plugins/live-composer-page-builder/modules/tp-comments-form/module.php on line 1638

andhrasamacharam