అమరావతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి

February 13, 2019

నూజివీడు: ఈ రోజు తెల్లవారుజామున సుమారు 5 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఒక గుర్తుతెలియని వాహనం ఢీకొని నందిగం అమ్మాజీ(53) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన నూజివీడు మండలం గొల్లపల్లిలో చోటుచేసుకుంది.స్థానికుల సమాచారం మేరకు నందిగామ పోలీసులు మృతి చెందిన మహిళను పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read More

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) పై బురద చల్లడం మానుకోండి

February 13, 2019

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) పార్టీని డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ స్థాపించారని,నేడు ఎస్సి ఎస్టీలు, బిసి.మైనార్టీ లే కాకుండా ఓసి.లు కూడా అంబెడ్కర్ ఆశయాలు నచ్చి పార్టీలో పని చేయడానికి ముందుకు వస్తున్నారని అర్పిఐ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి బుదవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సి.ఎస్టీ. బిసి .మైనార్టీలు అదే బాటలో నేడు ఓసి కూడా అంబెడ్కర్ ఆశయాలు నచ్చి ఆకర్షితులై పార్టీలోకి వచ్చి పని చేస్తుంటే […]

Read More

నేడు మళ్లీ ఢిల్లీకి బాబు

February 13, 2019

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ దీక్షలో పాల్గొనేందుకు ఆదివారం రాత్రి అక్కడకు వెళ్లిన ఆయన.. మంగళవారం రాత్రే ఇక్కడకు తిరిగివచ్చారు. అయితే ఢిల్లీ రాష్ట్ర సమస్యలపై ఆ రాష్ట్ర సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం అక్కడ నిరసన దీక్ష చేపడుతున్నారు. దానికి సంఘీభావం తెలిపేందుకు బుధవారం మధ్యాహ్నం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. దీనికోసం బుధవారం సాయంత్రం జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని చంద్రబాబు ఉదయానికే మార్చారు. కాగా.. విజయనగరంలో ముఖ్యమంత్రి పర్యటన […]

Read More

గుంటూరు జిల్లా అభ్యర్థులను ప్రకటించిన అర్పిఐ రాష్ట్ర కమిటీ

February 12, 2019

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర కమిటీ నిర్ణయాలను రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) జాతీయ అద్యక్షుడు, సెంట్రల్ మినిస్టర్ శ్రీ రాందాస్ అత్వాలే గారి పర్యటన మార్చి మొదటి వారంలో ఉంది. దానిని విజయవంతం చేయాలి ఫిబ్రవరి నెల చివరకు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే నిర్ణయాలు. # గ్రామ స్థాయిలో సభ్యత్వం, పూర్తి చేయాలి. # […]

Read More

సుమోటోగా ఓట్లను తొలగిస్తే చర్యలు తప్పవు: సీఈసీ సునీల్ అరోరా

February 12, 2019

. ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని ఫిర్యాదులందాయి . ఏ స్థాయి అధికారులు తప్పు చేసినా చర్యలు తప్పవు . బోగస్ ఓట్లపై 3 రోజుల్లో ఎంపిక చేసిన చోట తనిఖీలు ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్న నేపథ్యంలో భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ (సీఈసీ) సునీల్ అరోరా ఏర్పాట్ల పర్యవేక్షణ నిమిత్తం ఏపీకి వచ్చారు. ఈ సందర్బంగా విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని కొన్ని రాజకీయ […]

Read More

రాష్ట్రపతితో ఏపీ సీఎం చంద్రబాబుభేటీ

February 12, 2019

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ అయ్యారు. ఆయనతోపాటు ఎంపీ అశోక్‌గజపతిరాజు, పలువురు టీడీపీ ముఖ్య నేతలు ఉన్నారు. చంద్రబాబు ఏపీ భవన్‌ నుంచి ఎంపీలు, పార్టీల నేతలతో కలిసి రాష్ట్రపతి భవన్‌ వరకు పాదయాత్రగా నడిచి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని 18 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు అందజేసినట్లు సమాచారం. మొదట రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, […]

Read More

వారి ద్దరూ భయంకరమెయిన వ్యక్తులు : సీఎం చంద్రబాబు

February 12, 2019

ప్రధాని మోడీ రాజధర్మాన్ని వదిలి ఆంధ్రప్రదేశ్ పై కక్ష పెంచుకున్నారు. తెలుగు వారెప్పుడూ ఆత్మగౌరవంతో బ్రతుకుతారు. అది దెబ్బ తినే పరిస్థితి వస్తే తిరగబడతారు. ఇది చారిత్రాత్మక సత్యం. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. చలిలో వేలాది మైళ్ళు ప్రయ్నమ్ చేసి వచ్చి న్యాయం కోసం అడుగుతుంటే అవమానిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన ధర్మ దీక్ష ముగింపు సందర్బంగా రాత్రి ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాలపై గతంలో […]

Read More

ఎస్సి ఎస్టీ నిధులు మళ్లిస్తే ఊరుకోము :అర్పిఐ రాష్ట్ర కమిటీ

February 12, 2019

ఎన్నికలలో అధికార పార్టీ ఎన్నికల తాయిలాల కోసం ఎస్సి ఎస్టీ నిధులను మళ్లించి వారికి త్రివ ద్రోహం చేస్తున్నారని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టే విధంగా అధికార పార్టీ నిధులను మళ్లించడం తగదన్నారు. ఎస్డీ ఎస్టీ నిధులు కేటాయించి వారి సంక్షేమము కోసం కాకుండా వేరు వేరు కార్యక్రమాలకు కేటాయించడం వారి ఎంత వరకు సబబు అన్నారు. ప్రభుత్వం ఆచరణలో ఎంత మంది అర్హులకు ఎస్సి ఎస్టీ […]

Read More

అనంతపురం లో జగన్ ‘అన్న భరోసా’

February 12, 2019

అనంతపురం : వాచ్‌మెన్‌లు, స్వీపర్లకే అనంతపురం నిరుద్యోగులను పరిమితం చేయడం దుర్మార్గమని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అన్న పిలుపు’లో భాగంగా సోమవారం ఆయన అనంతపురంలో తటస్థులతో సమావేశమయ్యారు. నగరంలోని శ్రీ 7 కన్వెన్షన్‌ హాలులో జరిగిన ఈ ముఖాముఖిలో తటస్థులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై వైఎస్‌ జగన్‌ భరోసా కల్పించారు. కియా కార్ల పరిశ్రమ వల్ల ఏం ప్రయోజనం లేదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారని […]

Read More

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

February 11, 2019

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. మొత్తం 6.10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్న ఆయన.. ఈ నెల 7వ తేదీ లోపు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వరకు మొత్తం 2,833 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని, నెల రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు. హాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు ఏపీ SSC ఎగ్జామ్ […]

Read More
andhrasamacharam