ఆంధ్రప్రదేశ్

ముగిసిన వివేకా అంత్యక్రియలు

March 16, 2019

పులివెందులలో వైయస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు. వైయస్ రాజారెడ్డి ఘాట్ లో ఈ ఉదయం 11 గంటలకు అంత్యక్రియలను నిర్వహించారు. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంతిమ కార్యక్రమాలను ముగించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ సహా కుటుంబసభ్యులంతా హాజరయ్యారు. అంతకు ముందు వివేకా నివాసం నుంచి రాజారెడ్డి ఘాట్ వరకు అంతిమయాత్రను నిర్వహించారు. ఈ అంతిమయాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. […]

Read More

ఆయన ఇల్లెక్కడో కూడా నాకు తెలీదు

March 16, 2019

వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో జైలు శిక్ష అనుభవించి, ఇటీవలే విడుదలైన సుధాకర్ రెడ్డి తెలిపారు. వివేకానందరెడ్డి ఇల్లు ఎక్కడుందన్న విషయం కూడా తనకు తెలియదని వ్యాఖ్యానించారు. తాను ఇప్పుడు 9 ఎకరాల్లో అరటిపంట వేసుకుని సాగుచేసుకుంటున్నానని పేర్కొన్నారు. అసలు వైఎస్ రాజారెడ్డి హత్యతో కూడా తనకు సంబంధం లేదనీ, అన్యాయంగా ఆ కేసులో తనను ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను […]

Read More

ప్రకాశం జిల్లాలో పెను విషాదం

March 16, 2019

ప్రకాశం జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధకు తాళలేక కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని కొమరోలు మండలం అల్లినగరంలో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జక్కా రాఘవేంద్ర నాగరాజు(45) బెంగళూరులోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు స్థానికంగా ఓ దుకాణం నిర్వహిస్తూ జీవిస్తున్నారు. అయితే, చేసిన అప్పులు పీకల మీదకు వచ్చి పెను భారంగా మారడంతో ఏం చేయాలో పాలుపోని […]

Read More

సాయంత్రం గవర్నర్ ను కలవనున్న వైసీపీ బృందం

March 16, 2019

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేటి సాయంత్రం నాలుగు గంటలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలుసుకోనున్నారు. పార్టీ నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లనున్న జగన్.. వివేకానందరెడ్డి హత్య విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లనున్నారు. దీంతో పాటు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రాజకీయ హత్యలను గవర్నర్ దృష్టికి తెస్తారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు ఈ హత్యలు నిదర్శనమని ఆయనకు ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు, వివేకానందరెడ్డి హత్య నేపథ్యంలో  రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు నిర్వహించాలని కార్యకర్తలకు వైసీపీ […]

Read More

హత్యకు పక్కా ప్రణాళిక!

March 16, 2019

మాజీ మంత్రి, వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఆయన ఇంటి పరిసరాల్లో నిత్యం తచ్చాడే ఓ కుక్కను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపేశారు. ఆ ప్రాంతంలో కొత్త వ్యక్తులు కనబడితే మొరిగే ఈ శునకాన్ని మర్డర్ ప్లాన్‌లో భాగంగానే హత్య చేసినట్టు చెబుతున్నారు. అది ఉంటే ఆ ప్రాంతంలోకి వెళ్లడం కష్టమనే ఉద్దేశంతో ముందుగానే దానిని చంపేసినట్టు తెలుస్తోంది. హత్యకు ముందు నిర్వహించిన రెక్కీలో ఈ కుక్కను […]

Read More

అన్నీ అనుమానాలే!: సీఎం చంద్రబాబు నాయుడు

March 16, 2019

వైఎస్సార్సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ కేసులో అన్నీ అనుమానాలే కలుగుతున్నాయని అన్నారు. వివేకానందరెడ్డి మరణం వ్యక్తిగతంగా చాలా బాధ కలిగించిందని చెప్పారు చంద్రబాబు. అయితే, ఆయన మరణం ఎంతో అనుమానాస్పదం కావడం పట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఆధారాలను తారుమారు చేయడానికి జరిగిన ప్రయత్నాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అన్నారు. “సాధారణంగా ఎవరైనా చనిపోతే డెడ్ బాడీని కానీ, సంఘటన స్థలాన్ని కానీ […]

Read More

వివేకా హత్య; ఘటనాస్థలం లో లేఖ

March 16, 2019

వైఎస్సార్సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి మృతి వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. మొదట గుండెపోటుగా తెరపైకి వచ్చిన ఈ వ్యవహారం పోస్టుమార్టం తర్వాత హత్య అని తేలింది. అంతలోనే, వివేకా రాసినట్టుగా పేర్కొంటున్న ఓ లేఖ తెరపైకి వచ్చింది. దాన్ని తమకు అందించింది వివేకా కుటుంబ సభ్యులేనని చెబుతున్నారు కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. వివేకా హత్య గురించి మీడియాతో మాట్లాడుతూ, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఆ లేఖను పరిశీలించామని, పెన్ […]

Read More

వివేకా మృతిపై అనుమానాలు… రంగంలోకి దిగిన పోలీసులు!

March 15, 2019

ఈ తెల్లవారుజామున పులివెందులలోని తన ఇంటి బాత్ రూమ్ లో వైఎస్ వివేకానందరెడ్డి విగతజీవిగా కనిపించగా, ఆయన మృతి వెనుక అనుమానాలు ఉన్నాయని వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. వివేకా మృతదేహం రక్తపు మడుగులో కనిపించిందని చెప్పిన ఆయన, తలకు, చేతికి బలమైన గాయాలు కనిపిస్తున్నాయని తెలిపారు. కృష్ణారెడ్డి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు ఏర్పాట్లు […]

Read More

గుండెపోటుతో వైఎస్ వివేకానందరెడ్డి మృతి

March 15, 2019

వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. స్వగృహంలోనే ఆయన గుండెపోటుతో కుప్పకూలినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వివేకానందరెడ్డి సొంత తమ్ముడు. ఆయన అకాల మరణం వైసీపీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేసింది.

Read More

విజయవాడ ఏటీఎం కేంద్రంలో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ఏటీఎం యంత్రాలు!

March 14, 2019

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఈరోజు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కానీ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునేటప్పటికే ఏటీఎం కేంద్రంలోని యంత్రాలు దగ్ధం అయ్యాయి. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. బ్యాంక్ పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ పేలడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై […]

Read More
andhrasamacharam