దైవం

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

February 12, 2019

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి ఆలయ తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. రథసప్తమి సందర్భంగా తిరుమల శ్రీవారు ఒకేరోజు ఏడు వాహనాలు అధిరోహించి భక్తులను కనువిందు చేయనున్నారు.అలాగే ఉదయం 9 గంటల నుంచి 10గంటల వరకు చిన్నశేషవాహనం, ఉదయం 11 గంటల నుంచి 12గంటల వరకు గరుడవాహనం, మధ్యాహ్నం 1గంటల నుంచి 2గంటల వరకు హనుమంతవాహనం, మధ్యాహ్నం 2గంటల నుంచి […]

Read More

రధసప్తమిపవిత్రమైనరోజు

February 12, 2019

రధసప్తమిపవిత్రమైనదినం 12/2/2019 ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. ఈ దినాన అరుణోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి – అని ధర్మశాస్త్రం చెబుతుంది. ఈ సప్తమి సూర్యగ్రహణంతో సమానం. “సూర్యగ్రహణ తుల్యాతు శక్లామాఘస్ […]

Read More

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పార్వేట ఉత్సవం

January 17, 2019

తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాదీ సంక్రాంతి కనుమ పండుగ మరునాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకెెళ్లారు. అక్కడ ఆస్థానం నిర్వహించారు.  స్వామివారి వేటను తిలకించడానికి పారువేట మండపానికి విశేష సంఖ్య‌లో భక్తులు విచ్చేసారు. తిరిగి నగరవీధుల్లో ఊరేగింపుగా ఉత్సవమూర్తులను […]

Read More

పెద్ద పండగ ..

January 13, 2019

పెద్ద పండగ .. నిజంగానే సంక్రాంతి పెద్దపండగే!  ఏ పండుగైనా ఒక దేవత పేరుమీద జరుగుతుంది. ఒకే తీరుగా సాగుతుంది. కానీ.. ఈ  పండుగ మాత్రం ఎన్నో విశిష్టతలతో సాగుతుంది. ఈ  పండగ ప్రకృతితో మమేకమవుతుంది. ఆధ్యాత్మికంగా అందరికి ఉషస్సులనిస్తుంది. సామాజికాంశాలతో ముడిపడిపోతుంది. ఎవరు ఏ విధంగా సంబరాల్ని జరుపుకోవాలంటే ఆ విధంగా ఆనందించొచ్చు. మూడు రోజుల పండుగ గా చెప్పినా ఇది నెల రోజుల ఉత్సవం. నెలగంట  తో ముత్యాల ముగ్గులతో మొదలయ్యే మకర సంక్రాంతి […]

Read More

సంబరాల సంక్రాంతి

January 13, 2019

ముత్యాల లోగిళ్ళలో.. గొబ్బెమ్మల ముస్తాబుల మధ్య.. వేకువజామున చలిగిలిని పారదోలుతూ భోగిమంటలు.. కోడిపందాలు.. పేకాటల సరదాల మత్తులో పురుషపుంగవులు.. బంధుమిత్రుల సపర్యల్లో మునిగి తేలుతూనే సంబరాల్ని అబ్బురంగా చూసుకుంటూ మురిసిపోతున్న ముదితలు.. పట్టణాల జీవితాన్ని పక్కనపెట్టి పండగ వెలుగులో పల్లె అందాల్ని ఆస్వాదిస్తూ యువత.. భుక్తికోసం దూరతీరాలకేగిన బిడ్డలందరూ కనుల ముందు సందడి చేస్తుంటే కోటి కాంతులతో కళ్లారా చుసుకుంటూ పెద్దోళ్లు.. ఇలా తరాంతరాలన్నీ పల్లెల్లో సంక్రాంతి వేడుకల్లో మునిగి తేలుతున్నాయి. ఉరుకులు పరుగుల పట్టణాలు ప్రశాంతంగా ఊపిరి పిలుచుకుంటున్నాయి. […]

Read More

దీక్షల విరమణకు పక్కా ఏర్పాట్లు: కృష్ణజిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం

December 24, 2018

  విజయవాడ :ప్రభుత్వ శాఖల అధికారులందరూ కలిసి భవానీ దీక్షల విరమణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం పేర్కొన్నారు. ఈనెల 29వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు జరగనున్న దీక్షల విమరణను పురస్కరించుకుని వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ చేసే భవానీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడెక్కడ ఎలాంటి వసతులు కల్పిస్తున్నారనే విషయమై […]

Read More
andhrasamacharam