రాయలసీమ

వివేకా మృతిపై అనుమానాలు… రంగంలోకి దిగిన పోలీసులు!

March 15, 2019

ఈ తెల్లవారుజామున పులివెందులలోని తన ఇంటి బాత్ రూమ్ లో వైఎస్ వివేకానందరెడ్డి విగతజీవిగా కనిపించగా, ఆయన మృతి వెనుక అనుమానాలు ఉన్నాయని వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. వివేకా మృతదేహం రక్తపు మడుగులో కనిపించిందని చెప్పిన ఆయన, తలకు, చేతికి బలమైన గాయాలు కనిపిస్తున్నాయని తెలిపారు. కృష్ణారెడ్డి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు ఏర్పాట్లు […]

Read More

గుండెపోటుతో వైఎస్ వివేకానందరెడ్డి మృతి

March 15, 2019

వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. స్వగృహంలోనే ఆయన గుండెపోటుతో కుప్పకూలినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వివేకానందరెడ్డి సొంత తమ్ముడు. ఆయన అకాల మరణం వైసీపీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేసింది.

Read More

చిత్తూరులో భారీగా నగదు పట్టివేత

March 14, 2019

చిత్తూరు జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. వడమాలపేట టోల్‌ప్లాజా వద్ద గురువారం నిర్వహించిన తనిఖీల్లో టాటా ఏస్‌ వాహనంలో తరలిస్తున్న రూ.1.09 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు కొన్ని క్రీడా సామగ్రిని కూడా సీజ్‌ చేశారు. ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో ఈ నగదు పట్టుబడింది. తమిళనాడు నుంచి తిరుపతి తరలిస్తుండగా పోలీసులు వీటిని పట్టుకున్నారు.

Read More

అనంతపురం లో జగన్ ‘అన్న భరోసా’

February 12, 2019

అనంతపురం : వాచ్‌మెన్‌లు, స్వీపర్లకే అనంతపురం నిరుద్యోగులను పరిమితం చేయడం దుర్మార్గమని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అన్న పిలుపు’లో భాగంగా సోమవారం ఆయన అనంతపురంలో తటస్థులతో సమావేశమయ్యారు. నగరంలోని శ్రీ 7 కన్వెన్షన్‌ హాలులో జరిగిన ఈ ముఖాముఖిలో తటస్థులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై వైఎస్‌ జగన్‌ భరోసా కల్పించారు. కియా కార్ల పరిశ్రమ వల్ల ఏం ప్రయోజనం లేదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారని […]

Read More

బాబు కుట్రల్ని తిప్పికొట్టండి

February 7, 2019

ఐదేళ్ల క్రితం చంద్రబాబు అనే పెద్ద మనిషిని నమ్మి మోసపోయాం.. నాలుగున్నరేళ్లలో అన్ని రకాలుగా మోసం చేసి సినిమాలు చూపించారు. అన్న వస్తున్నాడని చెప్పండి.. ప్రతి పేదవాడికి సంక్షేమం అందుతుందని భరోసా ఇస్తామని హామీ ఇవ్వండి. ఎన్నికలొస్తున్నాయనే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొచ్చారని విమర్శించారు వైసీపీ అధినేత జగన్. ఓట్ల కోసమే నోటికొచ్చినట్లు అబద్దాలు చెబుతూ మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. డబ్బు సంచులతో ఎన్నికల్లో గెలిచే ప్రయత్నిస్తున్నారని.. చంద్రబాబు కుట్రల్ని వైసీపీ నేతలు, కార్యకర్తలు తిప్పికొట్టాలని […]

Read More

చంద్రబాబు ప్రజలకు సినిమా చూపిస్తున్నారు

February 6, 2019

చంద్రబాబు ప్రజలకు సినిమా చూపిస్తున్నారని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో బుధవారం  శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. ఈ  సందర్బంగా జగన్ సీఎం చంద్రబాబు నాయుడును తీవ్ర స్థాయిలో విమర్శించారు.  నాలుగున్నరేళ్లలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. అవన్నీ తాను.. పాదయాత్రలో చూశానన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకొస్తానని ప్రజలకు సభాముఖంగా హామీ ఇచ్చారు. గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలుకావడం లేదని మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఈ మనిషిని అన్న అనాలా? దున్న అనాలా? […]

Read More

నాపై దాడి చేసేందుకు యత్నించిన వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి: వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి

February 5, 2019

ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా ‘పసుపు-కుంకుమ’ ప్రభుత్వ కార్యక్రమం ఇదేమీ ‘జన్మభూమి’ కాదు నిన్న చంద్రగిరి మండలంలో నిర్వహించిన ‘పసుపు-కుంకుమ’ కార్యక్రమంలో వైసీసీ-టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో వైసీసీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పృహ తప్పి పడిపోవడం, రుయా ఆసుపత్రికి తరలించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడారు. తనపై దాడి చేసేందుకు యత్నించిన వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని, ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ‘పసుపు-కుంకుమ’ ప్రభుత్వ కార్యక్రమం […]

Read More

అనంతపురంలో ప్రారంభమైన జాతీయ స్థాయి యూత్ పార్లమెంట్..!

January 29, 2019

అనంతపురంలో ప్రారంభమైన జాతీయ స్థాయి యూత్ పార్లమెంట్..! అనంతపురం జిల్లా ,ఎస్, కె ,యూనివర్సిటీ లో ప్రారంభమైన జాతీయ యూత్ పార్లమెంట్ . ఎస్ కె యూనివర్సిటీ లో ప్రారంభమైన జాతీయ యూత్ పార్లమెంట్ నందు ముఖ్య అతిథిగా నీకు జాతీయ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఎస్కేయూ వైస్ ఛాన్స్లర్ రహంతుల్లా ,జిల్లా ఫారెస్ట్ అధికారి వెంకటరమణ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎన్ఎస్ఎస్ అధికారులు జిల్లా వ్యాప్తంగా అన్ని కాలేజిల నుంచి తరలివచ్చిన యువతీ యువకులు పాల్గొన్నారు.భారత […]

Read More

మన శక్తి ఏంటో కేంద్రానికి తెలిసేలా నిర్మిస్తాం

December 27, 2018

కడప: కడపలో ఉక్కు పరిశ్రమతో రాయలసీమ చరిత్ర  పూర్తిగా మారుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నిర్మాణాన్ని వీలైనంత త్వరలోనే పూర్తి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని చెప్పారు. కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడారు. మన శక్తి ఏంటో కేంద్రా నికి తెలియజెప్పేలా ఉక్కు పరిశ్రమ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. నీరు, విద్యుత్‌ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినా కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదని ఆయన విమర్శించారు. […]

Read More
andhrasamacharam