తెలంగాణా

హైటెక్ సిటీకి వచ్చే వారంలో మెట్రో పరుగులు!

March 16, 2019

హైటెక్ సిటీ ప్రాంతంలో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. అమీర్‌పేట-హైటెక్‌సిటీ మధ్య వచ్చేవారం నుంచి మెట్రో రైలు కూత పెట్టనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ కారిడార్‌లో పనులు గత నవంబరు నాటికే పూర్తి కాగా, తాజాగా రైళ్లు నడిపేందుకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (సీఎంఆర్ఎస్) అనుమతి ఇచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ మార్గంలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున  ఎటువంటి హడావుడి, ప్రచార […]

Read More

మల్కాజిగిరి నుంచి రేవంత్  

March 16, 2019

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలోకి దిగబోతున్న 8 మంది పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. సోనియా గాంధీ నివాసంలో శుక్రవారం రాత్రి సుదీర్ఘంగా సాగిన సమావేశం అనంతరం ఎనిమిది మంది అభ్యర్థులను ఖరారు చేశారు. నేడో, రేపో మరో 9 మంది అభ్యర్థులను ప్రకటించనున్నారు.  కాంగ్రెస్ చీఫ్ రాహుల్ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో సోనియాగాంధీ, ఏఐసీసీ కోశాధికారి అహ్మద్‌ పటేల్‌, సీఈసీ సభ్యులు వీరప్ప మొయిలీ, ఏఐసీసీ రాష్ట్ర […]

Read More

జయరాం హత్య కేసులో వీడిన మిస్టరీ

February 3, 2019

హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో మిస్టరీ వీడింది. రాకేష్‌రెడ్డిని హంతకుడిగా పోలీసులు నిర్ధారించారు. కిరాయి హంతకులతో జయరాంను హత్య చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో ఐదుగురిని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జయరాంను హైదరాబాద్‌లోనే చంపేసి మృతదేహాన్ని కంచికచర్ల వద్ద పడేసినట్లు తేల్చారు. రాకేష్‌రెడ్డి వద్ద తీసుకున్న రూ.4.5కోట్ల అప్పే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి, రెండు రోజులుగా దర్యాప్తు చేపట్టారు. సెల్‌సిగ్నల్స్ […]

Read More

రానున్న రెండు రోజులు మరింత చలి

January 30, 2019

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల పాటు చలిగాలుల ప్రభావం పెరగడంతో పాటు ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాది నుంచి ఈశాన్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావం వల్ల తెలంగాణలో చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో 48 గంటల పాటు తెలంగాణతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్టోగ్రతలు పడిపోయే అవకాశం ఉందన్నారు. గత వారం రోజులుగా వాతావరణంలో విపరీతమైన […]

Read More
andhrasamacharam