పోలవరం   గిన్నిస్‌ రికార్డు

ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం సోమవారం సరికొత్త రికార్డు సృష్టించింది. కాంక్రీట్‌ పనుల్లో శరవేగంగా దూసుకెళుతున్న ఈ ప్రాజెక్ట్‌ గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డులో చోటు సంపాదించింది. సోమవారం ఉదయం 8 గంటలకల్లా 32,100 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు పూర్తయ్యాయి. ఎముకలు కొరికే చలిలోనూ కార్మికులు విరామం లేకుండా ఈ ఘట్టంలో పాల్గొన్నారు. ప్రతి గంటకు సగటున 1300 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను ఫిల్లింగ్‌ చేశారు. అర్ధరాత్రి ఫ్లడ్‌లైట్‌ వెలుగుల్లోనూ పనులు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల వరకు ఈ పనులు ప్రారంభించారు. దాదాపు 4 వేల మంది సిబ్బంది ఇందులో పాలుపంచుకున్నారు.

2017లో యూఏఈలో ఓ టవరు నిర్మాణంలో భాగంగా 24 గంటల్లో 21,580 ఘనపు మీటర్ల కాంక్రీటు వేశారు. ఆ రికార్డును పోలవరం తాజాగా అధిగమిచింది. 16 గంటల్లోనే ఈ రికార్డును అందుకుంది. రికార్డు అనంతరం కూడా పనులు కొనసాగాయి. నవయుగ సంస్థ ఈ నిర్మాణాన్ని చేపట్టింది. పోలవరం ప్రాజెక్ట్‌ ఈ రికార్డును సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు. అధికారులను అభినందించారు. పోలవరం ప్రాజెక్ట్‌ను ఆయన సోమవారం మధ్యాహ్నం సందర్శించనున్నారు. గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధుల చేతుల మీదుగా అధికారికంగా రికార్డు పత్రాలను అందుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

andhrasamacharam