నా వయసు, పెళ్లి గురించి మాత్రం అడక్కండి! జబర్దస్త్ ఫేమ్ రేష్మి గౌతమ్


ప్రజలు కోరుకుంటున్న రాజకీయ మార్పును పవన్ కళ్యాణ్ తీసుకువస్తారని తాను  ఆశిస్తున్నానని జబర్దస్త్ ఫేమ్  రేష్మి గౌతమ్ చెప్పారు. ట్విట్టర్ లో ఆమె క్రిస్మస్ సందర్భంగా అభిమానులతో చాట్ చేశారు. సుడిగాలి సుధీర్ తో హీరోగా చేస్తారా అన్న ప్రశ్నకు మంచి కథ దొరికితే అని సమాధానమిచ్చారు. కొత్తగా ప్రస్తుతం ఏ సినిమాకి సైన్ చేయలేదని చెబుతూ అభిమానుల్లానే తానూ కూడా తన కొత్త సినిమా కోసం ఎదురుచూస్తున్నాన్నారు. సినిమాల్లో అవకాశాలు వచ్చినా జబర్దస్త్ ను వదిలిపెట్టబోనని అభిమానులకు స్పష్టం చేసిన రష్మీ.. తన వయసు, పెళ్లి గురించి అడిగే ప్రశ్నలు నచ్చవని చెప్పుకొచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

andhrasamacharam