ఈ నెల 26న కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న వంగ‌వీటి రాధా

వైసీపీ సీనియ‌ర్ నేత వంగ‌వీటి రాధా రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై ప్ర‌స్తుతం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.. ఆయ‌న రాజ‌కీయ భ‌విత‌వ్యంపై వంగ‌వీటి అభిమానుల్లో ఆందోళ‌న నెల‌కొంది.

ఇప్ప‌టికీ రెండు సార్లు వ‌రుస‌గా ఎన్నిక‌ల్లో ఓటమి పాలైన ఆయ‌న‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని మొన్న‌టి వ‌ర‌కు భావించారు. కానీ ఆయ‌న‌కు అనుకొని అడ్డుంకులు వ‌చ్చి ప‌డ్డాయి. 2004లో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి కాంగ్రెస్ త‌ర‌పున‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన వంగవీటి రాధా, 2009 ఎన్నిక‌ల్లో అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పీఆర్పీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు.ఇక గ‌త ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ త‌ర‌పున పోటీ చేసి ఓటమి చెందారు.

ఆ త‌ర్వాత నుంచి విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంపై ఫోక‌స్ పెట్టిన రాధా, రానున్న ఎన్నిక‌ల్లో అక్క‌డి నుంచి పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.
మొద‌ట్లో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ టికెట్ త‌న‌కే ద‌క్కుతుంద‌ని వంగ‌వీటి రాధా అనుకున్నారు.

నియోజ‌క‌వ‌ర్గంలోస్తృతంగా ప‌ర్య‌టించి వైసీపీని బలోపేతం చేశారు. కానీ విజ‌య‌వాడ సెంట్ర‌ల్ మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు రాక‌తో, రాధా టికెట్‌కు ఎర్త్ ప‌డింది. ఎప్ప‌టి నుంచో పార్టీలో ఉన్న వంగ‌వీటి రాధాకు కాద‌ని, మ‌ల్లాది విష్ణుకు జగన్ టికెట్ కేటాయించ‌డం బెజ‌వాడ వైసీపీలో చిచ్చు రేగింది.

కొద్ది రోజుల పాటు సెంట్ర‌ల్ సీటు వ్య‌వ‌హారం బెజ‌వాడ వైసీపీలో క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. విజ‌య‌వాడ వైసీపీ సెంట్ర‌ల్ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా మ‌ల్లాది విష్ణును నియ‌మించిన జ‌గ‌న్‌, ఆయ‌న‌కే టికెట్ ఖ‌రారు చేశారు.

విజ‌య‌వాడ తూర్పు లేదా మ‌చిలీప‌ట్నం ఎంపీగా పోటీ చేయాల‌ని జ‌గ‌న్ ఆదేశించారు.. అయితే అందుకు అంగీక‌రించ‌ని రాధా, సెంట్ర‌ల్ టికెట్ కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు.
కానీ సెంట్ర‌ల్ టికెట్ ఇచ్చేది లేద‌ని వైసీపీ అధిష్టానం తేల్చిచెబుతున్నా..

వంగవీటి రాధా మాత్రం విజ‌య‌వాడ తూర్పు నుంచి పోటీ చేసేందుకు స‌సేమిరా అంటున్నారు. గ‌త కొంత‌కాలంగా స్త‌బ్ధుగా ఉన్న ఆయ‌న‌, పార్టీ మార‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ క్ర‌మంలోఈ నెల  26న వంగ‌వీటి రంగా వర్ధంతి సంద‌ర్బంగా అభిమానుల స‌మక్షంలో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై వంగ‌వీటి రాధా కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

ఆ రోజున త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు సంబంధించి ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తార‌ని ఆయ‌న అన‌చ‌రులు చెబుతున్నారు. మ‌రి వంగ‌వీటి రాధా ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Undefined index: cookies in /home/content/n3pewpnaspod02_data06/42/42274742/html/wp-content/plugins/live-composer-page-builder/modules/tp-comments-form/module.php on line 1638

andhrasamacharam