వివేకా హత్య; ఘటనాస్థలం లో లేఖ

వైఎస్సార్సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి మృతి వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. మొదట గుండెపోటుగా తెరపైకి వచ్చిన ఈ వ్యవహారం పోస్టుమార్టం తర్వాత హత్య అని తేలింది. అంతలోనే, వివేకా రాసినట్టుగా పేర్కొంటున్న ఓ లేఖ తెరపైకి వచ్చింది. దాన్ని తమకు అందించింది వివేకా కుటుంబ సభ్యులేనని చెబుతున్నారు కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. వివేకా హత్య గురించి మీడియాతో మాట్లాడుతూ, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఆ లేఖను పరిశీలించామని, పెన్ తో లెటర్ రాసినట్టు తెలుస్తోందని అన్నారు.

ఆ లేఖపై రక్తపు మరకలు ఉన్నాయని చెప్పిన ఆయన… “డ్రైవర్ ను త్వరగా రమ్మని పిలిచాను… అందుకే నన్ను చంపబోతున్నాడు” అని ఆ లేఖలో ఉందంటూ వెల్లడించారు.. ఈ లేఖపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నాం అంటూ స్పష్టం చేశారు. ఈ లేఖలో డ్రైవర్ పేరును ప్రస్తావించడం కుట్రలో భాగం అని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు. తన చిన్నాన్న మృతి వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేందుకే డ్రైవర్ పేరును తీసుకువచ్చారని మండిపడ్డారు.  రక్తపు గాయాలతో ఉన్న తన చిన్నాన్న హంతకులు చూస్తుండగా ఆ లేఖను ఎలా రాయగలడని జగన్ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Undefined index: cookies in /var/www/wp-content/plugins/live-composer-page-builder/modules/tp-comments-form/module.php on line 1638

andhrasamacharam