ఒక రాష్ట్రం, ఒక సిరీస్ విధానం

దేశంలో ఎక్కడా లేని‌విధంగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం

ఒక రాష్ట్రం, ఒక సిరీస్ విధానంతో అందరికీ ఆదర్శంగా నిలిచాం

నాలుగేళ్ల క్రితం రవాణా శాఖ అంటే చాలా చెడ్డ పేరు ఉంది

లైసెన్స్ లను అధికారుల నుంచి కాకుండా ఏజెంట్ల ద్వారా ప్రజలు పొందేవారు

టిడిపి అధికారంలోకి వచ్చాక అటువంటి విధానాన్ని అరికట్టి సేవలను సరళీకృతం చేశాం

సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు ఎన్నో రకాల సేవలను అందిస్తున్నాం

ఒకే రాష్ట్రం, ఒకే సిరీస్ విధానాన్ని త్వరగా అందుబాటులో కి తేవడం వెనుక రవాణా శాఖ కమిషనర్, సిబ్బంది శ్రమ ఎంతో ఉంది

ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి మరింత ఆదాయం కూడా వస్తుంది

ఎక్కడా పన్నులు పెంచకుండా..‌రవాణా శాఖ ఆదాయాన్ని పెంచాం

వేలి ముద్ర లు పడకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది, అందువల్ల ఐరిస్ విధానాన్ని అందుబాటులోకి తెస్తాం

నేడు రవాణా శాఖ లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాం

ఇళ్లు, కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లి యల్.యల్.ఆర్ ‌మేళాలు నిర్వహించాం

ఒకప్పుడు చాలా ఇబ్బంది ఉండేది.. ఇప్పుడు గంటలో యల్.యల్.ఆర్ ను ఇస్తున్నాం

అభయ యాప్ ను అందుబాటులోకి తెచ్చి రవాణా వాహనాల్లో ప్రయాణం చేసే మహిళలకు భద్రత, భరోసా కల్పిస్తాం

అవినీతికి కేంద్రం గా ఉన్న రవాణా శాఖ ను నాలుగేళ్ల కాలంలో ఆదర్శ శాఖగా మార్చాం

ఎక్కడా అవినీతి కి ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా సేవలు అందిస్తున్నాం

ఒకె రాష్ట్రం, ఒకే సిరీస్ విధానం నా హయాంలో రావడం చాలా ఆనందంగా ఉంది

అడిగిన వెంటనే అవసరమైన జివోలను విడుదల చేసేలా సిఎం చంద్రబాబు కు కృతజ్ఞతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

andhrasamacharam