ఛత్తీస్‌గఢ్ లో ఎన్ కౌంటర్ :10 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో 10 మంది మావోయిస్టులు మృతి …
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో పదిమంది పోస్టులు నేలకొరిగారు ఎన్కౌంటర్ జరిగిన ఘటనా స్థలం నుండి అధికారులు భారీ ఎత్తున మందుగుండు సామగ్రి 11 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలము నుండి తప్పించుకున్న మావోయిస్టులకు కొరకు భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. ఈ విషయము జిల్లా ఎస్పి మోహిత్ గార్గ్ మాట్లాడుతూ ,బైరాన్ గాడ్ ప్రాంతంలో ఈరోజు ఎస్ టి ఎఫ్ డి ఆర్ జి ,భద్రతా బలగాలు కూబింగ్ చేపట్టారని తెలిపారు. ఇంతలోనే మావోయిస్టులు ఎదురు పడడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని అన్నారు .ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు వైపునుండి ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అన్నారు .ఘటనా స్థలం నుండి మరికొందరు తప్పించుకుని పారి పోయిన మావోయిస్టులకొరకు గాలింపు చర్యలు ముమ్మరం చేసాము అన్నారు,..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

andhrasamacharam