‘నేను వస్తున్నా’ : కె.ఎ. పాల్

”నేను ప్రజా శాంతి పార్టీ తో ప్రజల్లోకి వస్తున్నా… ‌అధికారంలోకి రావడం ఖాయం” అని ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకులు  కె.ఎ. పాల్ అన్నారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకరుల  సమావేశంలో మాట్లాడారు. మోడీ, చంద్రబాబు ఇద్దరు పూర్తిగా ప్రజలను మోసం చేశారని ఆయన చెప్పారు. రెండేళ్లుగా భారతదేశాన్ని ఏ విధంగా రక్షించాలని ప్రజా శాంతి పార్టి  ప్రణాళికలు తయారు చేస్తోందన్నారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా ద్ద నోట్ల రద్దు ముసుగులో భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు.
సేవ్ సెక్యూలర్ ఇండియా, మోడి హామీలను విస్మరించడం, చంద్రబాబు పూర్తి గా వైఫల్యం చెందడం వంటి కారణాలతో ఎపి లో  ప్రజా శాంతి పార్టి పోటీ‌చేసేందుకు సిద్ధం అవుతొందని చెప్పారు.
ప్రపంచంలో ఎంతో మంది తెలుగు‌వాళ్లు రాణిస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారనీ, అందుకు  తానె ఉదాహరణ అన్నారు. రెండు కోట్ల మంది తనను అనుసరిస్తున్నారన్నారు.
దేశంలో అన్ని మతాల వారు భయం గా బతుకుతున్నారు.. రాష్ట్రాన్ని, దేశాన్ని కమ్యూనల్  గా మార్చేందుకు ప్రజా శాంతి పార్టీ సీరియస్ గా రాజకీయాల్లో కి వస్తోందని చెప్పారు.  ప్రస్తుతం దేశంలో క్రైస్తవులు, ముస్లింలు అనేక మందితనకు మద్దతు పలుకుతున్నారనీ, తాను సేవ చేయని గ్రామం ఎపి లో  లేదనీ .. ప్రకృతి వైపరీత్యాలు వస్తే కోట్ల రూపాయలుఇచ్చాననీ  పాల్ చెప్పారు.  కేసీఆర్, చంద్రబాబు, వైయస్సార్ లు నా గురించి ఎంత గొప్పగా చెప్పారో యూట్యూబ్ లో చూడండన్నారు.
ప్రజా శాంతి పార్టిని గెలిపిస్తే  ఆయా నియోజకవర్గానికి వంద కోట్ల రూపాయల విరాళం ఇస్తాననీ, పాల్ ఆర్మీ సభ్యులంతా  గ్రామాలకు‌ వెళ్లి ఒక్కొక్కరు వంద మందిని పార్టిలో చేర్పిస్తే బహుమతులిస్తామన్నారు. వెయ్యి మందిని చేర్పిస్తే  మనిషికి మూడు వేల చొప్పున ఇస్తామన్నారు. తాము అధికారంలోకి రావడం ఖాయమనీ, వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలను పూర్తి గా రద్దు చేస్తామనీ ప్రకటించారు. నిరుద్యోగులు లేకుండా అందరికీ ఉపాధి కల్పిస్తామన్నారు.
ఇరవై రోజుల్లో ప్రజా శాంతి పార్టీ ప్రభంజనం ఏమిటో చూస్తారని చెప్పారు. అన్ని జిల్లాల్లో పర్యటనలు చేపట్టి చేరికలను ఆహ్వానిస్తామన్నారు. గ్రామగ్రామాన పర్యటనలు చేస్తూ ప్రజా శాంతి పార్టీలో చేర్పించేలా కో ఆర్డినేటర్లు పని చేస్తారని  తెలిపారు. ఫిబ్రవరి వరకు సమావేశాలు పెట్టి, మార్చి లో అభ్యర్దుల జాబితా ను ప్రకటిస్తామన్నారు. తమకు  ఎవరితో పొత్తు అవసరం లేదు.. ఎవరైనా వస్తే.. ఐదో, పది సీట్లు కేటాయిస్తామని చెప్పారు.
తన మా అన్నయ్య హత్య వెనుక తన వదిన పాత్ర ఉండని , ఒక రాజకీయ కుటుంబం వెనకుండి ఈ హత్య కు పధక రచన చేసిందని ఆరోపించారు. ఆ కేసుతో తనకు ఎటువంటి సంబందం లేదని కోర్టుకే పోలీసులు నివేదిక ఇచ్చారని చెప్పారు. తనను  కూడా హత్య చేసేందుకు కుట్రలు చేశారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Undefined index: cookies in /var/www/wp-content/plugins/live-composer-page-builder/modules/tp-comments-form/module.php on line 1638

andhrasamacharam