అమరావతి: ఉపాధ్యాయ ఉద్యోగ నియామాల కోసం నిర్వహించిన డీఎస్సీ ఫలితాలను ఈనెల 15న విడుదల చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2014లో మొదటి డీఎస్సీ నిర్వహించి 10వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేశామన్నారు.

రెండోసారి ఇటీవల డీఎస్సీ నిర్వహించామని, 6,81,178 మంది దరఖాస్తు చేసుకోగా 5,89,120 మంది పరీక్ష రాశారని తె లిపారు. 10వ తరగతిలో బాలికలు ఉత్తమ ప్రతిభ కనబరిచారని, పైలెట్‌ ప్రాజెక్టు కింద 31 కేజీబీవీల్లో ఇంటర్‌ను ప్రవేశపెట్టామని వివరించారు. వచ్చే విద్యాసంవత్సరం మరో 70 కేజీబీవీల్లోనూ ఇంటర్‌ ప్రవేశపెడతామని తెలిపారు. మరోవైపు కేజీబీవీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యేలు చిరంజీవులు, చాంద్‌బాషా కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

andhrasamacharam