న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ అయ్యారు. ఆయనతోపాటు ఎంపీ అశోక్‌గజపతిరాజు, పలువురు టీడీపీ ముఖ్య నేతలు ఉన్నారు. చంద్రబాబు ఏపీ భవన్‌ నుంచి ఎంపీలు, పార్టీల నేతలతో కలిసి రాష్ట్రపతి భవన్‌ వరకు పాదయాత్రగా నడిచి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని 18 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు అందజేసినట్లు సమాచారం.

మొదట రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి రాష్ట్రపతిని కలవాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే, రాష్ట్రపతి భవన్‌ కేవలం 11 మందికే అవకాశమివ్వడంతో ఆ మేరకే నేతలను తీసుకొని వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

andhrasamacharam