సంఘటితంగా ఉంటే సమస్యలు పరిష్కరించుకోవచ్చు

  • కార్మికులు ఎంత సంఘటితంగా ఉంటే సమస్యలు అంత వేగంగా పరిష్కరించుకోవచ్చని భూ నిర్వాసితులు, నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు రుత్తల ఎర్రాపాత్రుడు పేర్కొన్నారు. శ్రీశ్రీ శ్రీ కోటమ్మతల్లి డ్రైవర్లు, క్లీనర్ యూనియన్ ఏర్పాటయిన సందర్భంగా నాతవరం కోటమ్మతల్లి ఆలయం వద్ద కార్మికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రాపాత్రుడు మాట్లాడుతూ ఆన్రాక్ పరిశ్రమ ఏర్పాటు ప్రారంభంలో యాజమాన్యం కనీస వేతన చట్టం అమలు చేయక పోవడం వల్ల అప్పట్లో యూనియన్ గా ఏర్పడి ఉద్యమం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఉద్యమం వల్ల సుమారు ఆరువేల మంది కార్మికులకు రూ. 130 కోట్ల సెలవు జీతం ఇప్పించగలిగామన్నారు. అదేవిధంగా ఫ్యాక్టరీ నిర్మాణంలో పలు ప్రమాదాలు సంభవించినపుడు వారి బంధువులకు నష్టపరిహారం ఇప్పించడంలో విజయం సాధించగలిగామన్నారు. ఇవేకాకుండా కార్మికులకు సంబందించి పలు సమస్యలు పరిష్కరించగలిగామన్నారు. అయితే ఇవన్నీ యూనియన్లు ఏర్పాటై సంఘటితంగా ఉంటేనే సాద్యమవుతుందన్నారు. ఇదేకాకుండా ప్రస్తుత పరిస్తితులలో యూనియన్ లను విచ్చిన్నం చేసేందుకు కొంతమంది కుట్రలు చేస్తారని, ఆ విషయంలో సభ్యులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విశ్వభారతి ట్రైబల్ వెల్ఫేర్ సొసైటి అద్యక్షుడు గంగాధర్ మాట్లాడుతూ సరుగుడులో లభ్యమయ్యే బాక్సైట్ ను లేటరైట్ గా దోచేస్తున్నారని, దానిని ఆన్రాక్ కు తరలించి ఫ్యాక్టరీ ప్రారంబిస్తే ముందుగా మాకవరపాలెం, నాతవరం మండలాలకు ప్రయోజనం దక్కుతుందన్నారు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. సమావేశంలో యూనియన్ నాయకులు గవిరెడ్డి నరసింహ, కర్రి రాజుబాబు, ఈర్లె గోపీ, గవిరెడ్డి సూరిబాబు, గవిరెడ్డి భీమరాజు, గవిరెడ్డి వెంకటరమణ , రుత్తల లింగేశ్వరావు, మాకిరెడ్డి అప్పలనాయుడు, కె.రాము, పెదిరెడ్ల నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

andhrasamacharam