50% ఓట్లు ఉన్న మహిళలకు 50% సీట్లు ఎందుకు ఇవ్వరు

త్వరలో మహిళల పార్టీని ప్రకటిస్తాం

విజయవాడ:రాజ్యాధికారం మహిళలకు ఇస్తే వాళ్లకు కావాల్సిన నిర్ణయాలు స్వతంత్రంగా ఉండటమే కాకుండా దేశంకూడా అభివృద్ధి చెందిందని వుమెన్ ఎంపవర్ మెంట్ రూపకర్త లావణ్య కావూరి తెలిపారు.శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో లావణ్య మాట్లాడుతూ తాను ఎన్ఆర్ఐ అని యూకే నుంచి వచ్చానన్నారు.తాను పుట్టింది ఏలూరు దగ్గరలోని కుగ్రామంలో పుట్టి హైదరాబాద్ తదితర ప్రాంతంలో విద్యాభాసం పూర్తి చేసి ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడ్డానన్నారు. తాను పుట్టి పెరిగిన దేశానికి ఏదైనా ఇవ్వాలనేది ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదే దృడనిశ్చయమన్నారు. ఏ దేశంలోనైనా వుమెన్ ఎంపవర్మెంట్ లేదని ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదన్నారు. రాజకీయ నాయకులు ఎక్కడైనా సమస్య వస్తే అక్కడ పరిష్కారం కోసం ఎదురు చూస్తారని ఆ సమస్య ఎక్కడ ఉందో ఒక రాజకీయనాయకుడు కూడా అవగాహణ లేదన్నారు.అన్ని రంగాలలో ఏ రంగాలను చూసుకున్న పురుషుల ఆధిపత్యం కొనసాగుతుందని మహిళల పాత్ర ఏమి ఉండదన్నారు. మహిళలు 50 శాతం ఓట్లు ఉంటే 50 శాతం సీట్లు ఎందుకు ఎవరు అని పార్టీ నాయకులను ప్రశ్నించారు. కేవలం మహిళల లబ్దికోసం పదివేల రూపాయలు ఇచ్చి ఓటుబ్యాంకుగా వినియోగించుకుంటునారన్నారు. రిజర్వేషన్ల లో మహిళలకు 30 శాతం అని చెబుతున్న వీళ్లు కనీసం వాళ్ళ పార్టీలో 30 శాతం సీట్లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. 70 ఏళ్ల క్రితం ఈ సమాజం ఎంతటి ఆదిపధ్యం ఉందో అదేవిధంగా 70 ఏళ్ల తర్వాత కూడా అదే సమస్య ఉందన్నారు. కుటుంబంలో ఆడవాళ్ళు తెలివిగా వ్యవహరిస్తారని కుటుంబ బాధ్యతలు చక్కగా నెరవేరుస్తారన్నారన్నారు. ఇప్పటికైనా మహిళలు మేల్కొని రాజకీయరంగంలో రావాలని ఆమె కోరారు. త్వరలోనే తాను మహిళా పార్టీని స్థాపిస్తానని మహిళలకు 70 శాతం సీట్లను కేటాయిస్తానని, మహిళలను ప్రోత్సహించే పురుషులకు 30 శాతం సీట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఉమెన్ ఎంపవర్మెంట్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

andhrasamacharam