ఆంధ్రప్రదేశ్‌ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి యనమల

 
ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు 11వ సారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2019-20 సంవత్సరానికి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రసంగించారు. ఈ  సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని విమర్శించారు. దాని వల్ల రాజధాని నగరాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయ-వ్యయాలు, ఆస్తులు, అప్పులు సరిగా పంపిణీ చేయలేదన్నారు. 2019-20 బడ్జెట్‌ అంచనా రూ.2,26,117.53కోట్లు కాగా, గతేడాది కన్నా ఇది 18.38శాతం పెరుగుదల. రెవెన్యూ వ్యయం రూ.1,80,369.33కోట్లు(20.03శాతం పెంపు కాగా, మూలధన వ్యయం రూ.29,596.33కోట్లు, రెవెన్యూ మిగులు రూ.2099.47కోట్లుగా అంచనా వేయగా, ఆర్థికలోటు 32,390.68కోట్లుగా అంచనా వేశారు. 

ఆంధ్రప్రదేశ్‌ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ 2019-20 ముఖ్యఅంశాలు .. * ఈ బడ్జెట్‌లో రైతులకు మరో వినూత్న పథకం రైతు సంక్షేమం కోసం ‘అన్నదాత సుఖీభవ’ పథకం. ఈ పథకానికి రూ.5వేల కోట్లు* ఆహార శుద్ధి పరిశ్రమలకు రూ.300కోట్లు.* మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ రూ.1000 కోట్లు * పశుగ్రాసం అభివృద్ధికి రూ.200 కోట్లు.* పశువులపై బీమా కోసం రూ.200కోట్లు* చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహానికి రూ.400 కోట్లు* డ్రైవర్స్‌ సాధికార సంస్థకు రూ.150కోట్లు * ఇళ్ల స్థలాల సేకరణ కోసం రూ.500 కోట్లు* క్షత్రియుల సంక్షేమం కోసం రూ.50కోట్లు * వెనుకబడిన వర్గాల కార్పొరేషన్లకు రూ.3వేల కోట్లు * బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు
* వ్యవసాయ మార్కెటింగ్‌, కో-ఆపరేటివ్‌కు రూ.12,732.97కోట్లు* పాడి పశు సంవర్ధక, మత్స్యశాఖకు రూ.2,030.87కోట్లు* అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక రంగాలకు రూ.491.93కోట్లు* వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.8,242.64కోట్లు* ఉన్నత విద్యాశాఖకు రూ.3,171.63కోట్లు* సెకండరీ విద్యాశాఖకు రూ.3,171.63కోట్లు * విద్యుత్‌, మౌలిక వనరులకు రూ.5,473.83కోట్లు*, పౌరసరఫరాలశాఖకు రూ.3,763.42కోట్లు* ఆర్థికశాఖకు రూ.51,841.69కోట్లు* సాధారణ పరిపాలన రూ.1,177.56కోట్లు* వైద్యం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం రూ.10,032.15కోట్లు* హోంశాఖకు రూ.6,397.94కోట్లు * గృహ నిర్మాణం రూ.4,079.10కోట్లు* జలవనరులశాఖ రూ.16,852.27కోట్లు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

andhrasamacharam