తడబాటు తో ప్రారంభించి.. ధనా ధన్ మెరుపులు మెరిపించి.. గౌరవప్రదమైన స్కోరు సాధించి.. అవతలి జట్టును పద్ధతిగా ఆలౌట్ చేసి తిరుగు లేని విజయాన్ని నమోదు చేసింది టీమిండియా.. కివీస్ తో జరుగుతున్న 5 వన్డేల సిరీస్ లో చివరి వన్డేలో భారత జట్టు సునాయాస విజయాన్ని సాధించి 4-1 తో సిరీస్ ను కైవసం చేసుకుంది. నాలుగో వన్డేలో పేకమేడలా కూలిపోయిన బ్యాటింగ్ లైనప్ ఐదో మ్యాచ్ లో నిలదొక్కుకుంది. దింతో 252 పరుగులు చేసింది టీమిండియా.. అనంతరం 44. ఓవర్లలోనే కివీస్ ను ఆలౌట్ చేసి 35 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని నమోదు చేసింది. 
బౌలింగ్ కి అనుకులిస్తున్న పిచ్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. కివీస్ బౌలర్లు అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని 18 పరుగులకే నాలుగు వికెట్లను కూల్చారు. రోహిత్(2), ధావన్(6), గోల్ఫ్(7), ధోని(1) వరుసగా అవుట్ అయ్యారు. దీంతో నాలుగో వన్డే కథే పునరావృతం అవుతున్నట్టనిపించింది.  కానీ,తరువాత అంబటిరాయుడు(90) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయడంతో భారత్ పుంజుకుంది. రాయుడికి విజయశంకర్(45) తోడుగా నిలిచాడు. ఇక చివర్లో హార్దిక్ పాండ్యా(45) సిక్సర్ల మోత  మోగించడంతో కివీస్ కు సవాలైన స్కోర్ ను లక్ష్యంగా ఇచ్చింది టీమిండియా. 
స్కోరు మరి పెద్దయి కాకపోయినా కివీస్ కు భారత బౌలర్లు ఏ మాత్రం అవకాశాన్ని ఇవ్వలేదు. భువనేశ్వర్, షమీ, పాండ్య, చాహల్ క్రమశిక్షణగా బంతులేసి అవతలి బాట్స్మెన్ ను కుదురుకోనీయలేదు. దింతో న్యూజిలాండ్ 175 పరుగులుమాత్రమే చేయగలిగింది. ధోనీ  మార్క్.. వికెట్ల వెనుక ట్యాంకు తిరుగులేదని ధోనీ  మరోసారి రుజువు చేశాడు. ప్రమాదకరంగా విరుచుకుపడుతున్న నీషమ్‌ (44) ను రెప్పపాటు వేగంతో స్టంపౌట్ చేసి భారత్ ను విజయానికి చెరువు చేశాడు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

andhrasamacharam