కొమరం భీమ్, అల్లూరి జీవితాల నుంచి స్ఫూర్తి ఈ సినిమా: రాజమౌళి

తాను చిన్నతనం నుంచి కొమరం బీమ్, అల్లూరి సీతారామరాజుల జీవిత చరిత్రలు విని ఇన్ స్పైర్ అవుతూ పెరిగానని, వాటి ఆధారంగా అల్లుకున్న కథతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర కథను తయారు చేసుకున్నానని దర్శక దిగ్గజం రాజమౌళి వెల్లడించారు. తాను దర్శకత్వం వహిస్తున్న సినిమాపై తొలిసారిగా మీడియాతో మాట్లాడిన రాజమౌళి పలు విషయాలను మీడియాకు వెల్లడించారు. 1920 సంవత్సరంలో జరిగిన కథ ఇదని చెప్పారు. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నానని చెప్పిన రాజమౌళి, తాను ప్రతి సినిమా కథనూ ముందే చెబుతుంటానని, ఈ సంగతి అందరికీ తెలుసునని, కానీ ఈ సినిమా విషయంలో కాస్తంతా ఆలస్యం చేయడం వెనుక సరైన కారణమే ఉందని అన్నారు. సినిమా కథను ముందే చెప్పడం తనకు ఇష్టం లేకపోయిందని అన్నారు.

ఎన్టీఆర్‌- రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమాకు సంబంధించిన వివరాలను గురువారం రాజమౌళి వెల్లడించారు. ‘‘ఇలాంటి కథకు మాకు సహాయపాత్రలు కూడా భారీగానే ఉండాలి. మాకు అంతే భారీ తారాగణం అవసరం. అజయ్‌ దేవగణ్‌ సినిమాకు ఒప్పుకొన్నారు. ఆయనది చాలా కీలక పాత్ర. మెసేజ్‌ పెట్టగానే ఓకే అన్నారు. డేట్స్‌ ఎప్పుడు కావాలని అడిగారు. ఆయనకు పాత్ర చాలా నచ్చింది. ఆలియా భట్‌ చరణ్‌కు జోడీగా నటిస్తారు. ఆమె కూడా చాలా ఆత్రుతగా ఉన్నారు. ఏ పాత్రైనా చేస్తాను అన్నారు. తారక్‌కు జోడీగా డైసీ అడ్గార్జియోన్స్‌ చేస్తున్నారు. సముద్రఖని కూడా ఉన్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నారు. వర్కింగ్‌ టైటిల్‌ ఆర్‌ ఆర్‌ ఆర్‌. కానీ డిస్ట్రిబ్యూటర్స్‌లో చాలా మంది ‘బాగుంది దాన్నే టైటిల్‌ పెట్టండి’ అంటున్నారు. కానీ సినిమాకు అన్ని భాషల్లో ఆర్‌ ఆర్‌ ఆర్‌ అనే కామన్‌ టైటిల్‌ ఉంటుంది. కానీ ఒక్కో భాషలో టైటిల్‌ మాత్రం ఒక్కో రకంగా,  విభిన్నంగా ఉంటుంది. అయితే టైటిల్‌ను మాత్రం ఇప్పుడే చెప్పలేను. అభిమానులనే టైటిల్‌ను గెస్‌ చేయమంటున్నాం. ఇప్పటికైతే టైటిల్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ అనే అనుకుంటున్నాం. సీతారామరాజు యువకుడిగా ఉన్నప్పటి పాత్రను రామ్‌చరణ్‌, కొమురం భీం పాత్రను తారక్‌ చేస్తారు.’’

ఇదీ కథ: రాజమౌళి
‘‘దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రెస్‌ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా నమ్మకం ఏంటంటే.. ప్రేక్షకులు సినిమాకు వచ్చే ముందు సినిమా ఎలా ఉండబోతోంది అన్న అంచనాలు పర్‌ఫెక్ట్‌గా ఉండాలని నేను నమ్ముతాను. అందుకే నేను ప్రేక్షకులకు ముందే సినిమా గురించి చెప్పడానికి ఇష్టపడతా. 1897లో ఆంధ్రలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. ఆయన ఆంగ్లమే కాకుండా వేదాలు, ఇతిహాసాలు బాగా చదువుకున్నారు. యుక్తవయసులో ఇంట్లోంచి వెళ్లిపోయారు. మూడు సంవత్సరాల పాటు ఇంటిపట్టున లేరు. తిరిగొచ్చాక ఆయన స్వాతంత్ర్య ఉద్యమం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం మనకు తెలిసిందే.
1901లో ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్‌లో కొమురం భీం పుట్టారు. ఆయనకు కూడా యుక్త వయసులో ఉన్నప్పుడు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. తిరిగొచ్చాక చదువుకుని వచ్చారు. ఆయన కూడా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనుల కోసం పోరాడారు. అల్లూరిలాగే కొమురం భీం పోరాడారు. వాళ్ల చరిత్ర నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. అదే మేం సినిమాలో చూపించబోతున్నాం. ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేశాం. అందుకే సినిమా మొదలు పెట్టడానికి చాలా సమయం పట్టింది.’’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Undefined index: cookies in /var/www/wp-content/plugins/live-composer-page-builder/modules/tp-comments-form/module.php on line 1638

andhrasamacharam