ఆసీస్ తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో బ్యాట్సమెన్ భారత్ ను పటిష్ట స్థితిలో నిలబెట్టారు. తృటిలో పుజారా డబుల్ సెంచరీ మిస్ అవడం.. పంత్ రికార్డ్ ఇన్నింగ్స్.. జడేజా మెరుపులు.. రెండో రోజు ఆటలో హైలైట్స్ గా చెప్పొచ్చు. 
సాధికార ఇన్నింగ్స్ ఆడిన కీపర్ పంత్ 159 పరుగులు చేసి.. ధోని రికార్డును బద్దలు కొట్టాడు. 
622/7 వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా (193) త్రుటిలో ద్విశతకం చేజార్చుకున్నాడు. ఆట ముగిసే సరికి ఆసీస్‌ 24/0తో ఉంది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

andhrasamacharam