మొన్న పురుషులు.. వారి దారిలోనే నేడు మహిళలు.. క్రికెట్ లో టీమిండియా సాధించిన అద్భుతమిది. న్యూజిలాండ్ లో జరుగుతున్న మహిళల క్రికెట్ సిరీస్ లో భారత జట్టు విజయకేతనం ఎగురేసి సిరీస్ కైవసం చేసుకుంది. మొదటి వన్డేలో అల్ రౌండ్ ప్రతిభతో ఘానా విజయం సాధించిన భారత జట్టు.. రెండో వన్డేలోను విజృంభించి 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టుకు చుక్కలు చూపించి విజయం సాధించింది. జులన్  గోసామి (3/23), ఏక్తా బిష్ఠ్ (2/14), దీప్తి శర్మ (2/51) పూనమ్ యాదవ్ (2/38) బంతితో చెలరేగగా.. ఆతిధ్య న్యూజిలాండ్ జట్టు 44. ఓవర్లో 161 పరుగులకే అల్ అవుట్ అయింది. తర్వాత మంథాన, మిథాలీ బ్యాట్ తో విజృంభించడంతో 35. ఓవర్లో లోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. న్యూజిలాండ్ లో 1994 తరువాత వన్డే సిరీస్ గెలవడం భారత మహిళలకు ఇదే తొలిసారి. చివరి వన్డే శుక్రవారం జరుగుతుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

andhrasamacharam